ETV Bharat / city

ఐదుకిలోల శిశువు జననం... తల్లీబిడ్డ క్షేమం - తెనాలిలో ఐదు కిలోల బరువున్న బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2 నుంచి 4 కిలోల బరువు ఉంటారు. అందుకు భిన్నంగా ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో.. రేష్మ అనే మహిళకు 5 కిలోల బరువుతో ఓ బాబు పుట్టాడు. ఇది అరుదైన విషయంగా వైద్యులు చెబుతున్నారు.

5కిలోల బరువుతో శిశువు జననం... తల్లీ బిడ్డ సురక్షితం

author img

By

Published : Jan 27, 2021, 10:25 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో.. ఓ మహిళ 5 కిలోల బరువున్న బాబుకు జన్మనిచ్చింది. నందివెలుగుకు చెందిన రేష్మ అనే మహిళ.. తొలి కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. సాధారణ విధానంలో కాన్పు కష్టమని తేల్చిన వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. బాబు బరువు చూడగా 5 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2 నుంచి 4కిలోల వరకూ ఉంటారు. ఈ బాబు 5 కిలోలు ఉండటం.. అరుదైన విషయమని వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: నెమలి పించం ఆడేన్​.. పద్మశ్రీ వరించేన్​...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.