ETV Bharat / city

తోకతో జన్మించిన శిశువు.. ఎక్కడంటే..? - brazil

బ్రెజిల్​లో ఓ శిశువు అసాధారణ రీతిలో జన్మించాడు. ఆది మానవులకు ఉండేలా తోకతో పుట్టాడు. దీనిని చూసిన వైద్యుల ఆశ్చర్యపోయారు.

BABY BORN WITH TAIL
BABY BORN WITH TAIL
author img

By

Published : Nov 7, 2021, 2:57 PM IST

అప్పుడే జన్మించిన ఓ శిశువును చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. తాము చూసింది నమ్మలేకపోమారు. ఎందుకంటే ఆ శిశువు తోకతో జన్మించాడు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.

ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 వారాల గర్భిణి పురుటినొప్పులతో ఆల్బెర్ట్‌ సాబిన్‌ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స చేసి వైద్యులు మగ శిశువును బయటకు తీశారు. అయితే ఆ బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 12 సెంటీమీటర్లు ఉన్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతి లాంటి ఆకారం కూడా ఉంది.

గతంలో ఆ మహిళకు వైద్య పరీక్షలు చేసినప్పటికీ తోక ఆనవాళ్లు బయటపడలేదని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ తోకను 'నిజమైన మానవ తోక'గా అభివర్ణిస్తున్నారు. అయితే చర్మానికి మాత్రమే తోక పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి అనుసంధానం లేదని గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆ జన్యువుతో కరోనా మరణముప్పు రెట్టింపు- మనలోనే ఎక్కువట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.