ఖైరతాబాద్ కుశాల్ టవర్స్ వద్ద రాష్ట్ర ప్రైవేటు రవాణా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు డబ్బులు చెల్లించాలని బలవంతం చేయవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఫైనాన్స్ వ్యాపారులు తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైనాన్సర్ల వేధింపులతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. సీజింగ్ పేరుతో ఐదు వేల రూపాయలు వసూలు చేయడాన్ని నిలిపివేయాలని కోరారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రోడ్లపై వాహనాలు నిలిపి డ్రైవర్లను వేధించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 దృష్ట్యా ఒక సంవత్సరంపాటు పోలీసు జరిమానాలు విధించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : తెరాస శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్