ETV Bharat / city

ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే!

Aatmakoor Bypoll: ఏపీలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. ఈనెల 30న నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. నామినేషన్​ దాఖలుకు జూన్​ 6 వరకు గడువు విధించింది.

ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..!

author img

By

Published : May 25, 2022, 9:27 PM IST

Aatmakoor Bypoll: ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జూన్‌ 23న పోలింగ్‌ జరపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 30న నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. నామినేషన్​ దాఖలుకు జూన్​ 6 వరకు గడువు విధించింది. జూన్​ 23న పోలింగ్​ నిర్వహించి 26న లెక్కింపు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు:

  • ఉపఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల: మే 30
  • నామినేషన్లకు తుది గడువు: జూన్‌ 6
  • నామినేషన్ల పరిశీలన: జూన్‌ 7
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: జూన్‌ 9
  • పోలింగ్‌ తేదీ: జూన్‌ 23
  • ఓట్ల లెక్కింపు: జూన్‌ 26

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.