ప్రధాని మోదీ సంస్కరణలకు ఆకర్షితులమై.. భాజపాలో చేరేందుకు నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్యవైశ్య మహాసభ నాయకుడు మొగుళ్లపల్లి ఉపేందర్ వెల్లడించారు. చైతన్యపురి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని భాజపా సభకు అనుచరులతో ర్యాలీగా వెళ్లారు. నోట్ల రద్దు, సర్జికల్ స్టైక్స్, ట్రిపుల్ తలాక్, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు, 370 ఆర్టికల్ రద్దు వంటివి దేశంలో పెనుమార్పులు తీసుకొచ్చాయన్నారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనరావు సమక్షంలో భాజపాలో చేరుతున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: భాజపా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు