ETV Bharat / city

Kankipadu Casino: కంకిపాడులో క్యాసినో.. అనుమతులకు దరఖాస్తులు.. - ap latest news

Kankipadu Casino: ఏపీలోని గుడివాడలో నిర్వహించిన ‘గోవా క్యాసినో’ వ్యవహారం మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఈవెంట్‌కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్‌తో క్యాసినో.. మందు పార్టీలు, సినీ తారల డ్యాన్సులు, విందులు.. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ కంకిపాడు పోలీసులు మాత్రం క్యాసినో విషయం తమ దృష్టికి రాలేదని, ఈవెంట్‌ నిర్వహణకు మాత్రమే దరఖాస్తు అందిందని, అనుమతి ఇంకా ఇవ్వలేదని చెప్పారు.

Kankipadu Casino
కంకిపాడులో క్యాసినో
author img

By

Published : Jun 22, 2022, 11:52 AM IST

Kankipadu Casino: సంక్రాంతి సందర్భంగా ఏపీలోని గుడివాడలో నిర్వహించిన ‘గోవా క్యాసినో’ వ్యవహారం మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఈవెంట్‌కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్‌తో క్యాసినో.. మందు పార్టీలు, సినీ తారల డ్యాన్సులు, విందులు.. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈసారి పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వేదికగా మారింది. ఈరోజు రాత్రి నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీమంతులు, అతికొద్ది మంది నేతలు, ప్రముఖులకు ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు పంపారు. ఈ విషయం మంగళవారం బయటకు రావడంతో కలకలం రేగింది.

వివరాలు ఇలా ఉన్నాయి.. కంకిపాడు పట్టణంలో ఒక హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం ముద్రించి ఎంపిక చేసిన వారికి మాత్రమే పంపారు. ఇక్కడ గెట్‌ టు గెదర్‌ తరహాలో ఈవెంట్‌ నిర్వహించుకుంటున్నామని, అనుమతి ఇవ్వాలని కంకిపాడు పోలీసులకు దరఖాస్తు చేశారు. దీన్ని గన్నవరం ఏసీపీ కార్యాలయానికి పంపారు. కేవలం డాన్సులు, డీజే కోసం ఈ దరఖాస్తు చేశారు. మద్యం తాగేందుకు అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులకు దరఖాస్తు చేసుకోగా వారు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈవెంట్‌ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఉన్నత స్థాయి నుంచి ఇందుకు ఒత్తిళ్లు వచ్చాయని తెలిసింది. మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

ఈవెంట్‌ పేరుతో గోవా నుంచి అమ్మాయిలు, టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ తారలు, ప్రముఖ గాయకులు కూడా వస్తున్నట్లు తెలిసింది. వీరికి భారీగానే అడ్వాన్సులు కూడా చెల్లించారు. కన్వెన్షన్‌ సెంటర్‌కు క్యాసినో పేరుతో అడ్వాన్సులు చెల్లించారు. ఎంట్రీ రుసుము రూ.20వేల వరకు పెట్టినట్లు సమాచారం. గత రెండు రోజులుగా కంకిపాడులో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఈ క్యాసినో జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కంకిపాడు పోలీసులను వివరణ కోరగా క్యాసినో విషయం తమ దృష్టికి రాలేదని, ఈవెంట్‌ నిర్వహణకు మాత్రమే దరఖాస్తు అందిందని, అనుమతి ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఆఖరి నిమిషంలో ఈ క్యాసినో ఈవెంట్ రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది.

కంకిపాడులో క్యాసినో!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.