ETV Bharat / city

DEVARAGATTU : బన్నీ ఉత్సవంపై పోలీసుల మాట అదీ.. స్థానికుల మాట ఇదీ..!

ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల(Devaragattu Bunny festival)కు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిందే. దసరా రోజున కొనసాగే కర్రల సమరాన్ని వీక్షించేందుకు జనాలు పెద్దఎత్తున తరలివస్తారు. అయితే.. ఈసారి ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై స్థానికులు ఏమంటున్నారంటే...

arrangements-completed-for-devaragattu-bunny-festival-in-kurnool-district

author img

By

Published : Oct 14, 2021, 7:30 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా దేవరగట్టు(Devaragattu)లో దసరా పండుగ రోజున జరిగే బన్నీ ఉత్సవాల(Bunny festival)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు(security) ఏర్పాటు చేశారు. డ్రోన్ (Drone), సీసీ కెమెరాల(CC camera) ద్వారా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఉత్సవాన్ని నిర్వహించాలని, బంధువులను ఆహ్వానించొద్దని సూచించారు.

అదేవిధంగా.. శాంతియుతంగా బన్నీ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఇందులో భాగంగా.. పోలీసులు ఇప్పటికే వెయ్యికి పైగా కర్రలు స్వాధీనం(seize) చేసుకున్నారు. అయితే.. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తామని స్థానికులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది.

విశిష్ట చరిత..
దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. పండుగ రోజు ఇక్కడ జరిగే కర్రల ఉత్సవం తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. పండుగరోజు ఊరేగింపుగా బయలుదేరిన తమ ఇలవేల్పు మాల మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు రెండు ఊళ్ల ప్రజలు పోటీపడతారు.

ఇందు కోసం కర్రలతో యుద్ధం చేస్తారు. ఇందులో పైచేయి సాధించిన వారు స్వామివార్లను తమ గ్రామాలకు తీసుకెళ్తారు. ఇందులో నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఈ యుద్ధంలో తలలు పగిలి రక్తమోడుతున్నా.. కర్రల సమరం ఆపరు. అనాదిగా వస్తున్న ఈ ఆచారం నేటికీ కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.