ETV Bharat / city

Jeevan Reddy on Arvind: 'నిజంగానే దాడికి పిలుపునిస్తే అర్వింద్ తిరిగి రాగలడా..?' - Jeevan Reddy on bjp leaders

Jeevan Reddy on Arvind: భాజపాలో ఉన్న దుష్టచతుష్టయం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతొందని తెరాస ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్​పై రైతులకు ఉన్న ఆగ్రహమే దాడికి కారణమని తెలిపారు. దమ్ముంటే ఆపండని రెచ్చగొట్టిన ఫలితంగానే అర్వింద్​కు ఆర్మూర్​లో రైతులు సత్తా చూపారన్నారు.

armoor mla Jeevan Reddy comments on  mp Arvind

author img

By

Published : Jan 26, 2022, 8:41 PM IST

నిజంగానే దాడికి పిలుపునిస్తే అర్వింద్ తిరిగి రాగలడా..?

Jeevan Reddy on Arvind: కేంద్రంపై ఉన్న కోపానికి తోడు ఎంపీ అర్వింద్​పై రైతులకు ఉన్న ఆగ్రహమే ఆర్మూర్ ఘటనకు కారణమని.. ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు తెస్తానని మాట తప్పినందుకు రైతులు ఎంపీ అర్వింద్​పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. దమ్ముంటే ఆపండని రెచ్చగొట్టిన ఫలితంగానే అర్వింద్​కు ఆర్మూర్​లో రైతులు సత్తా చూపారన్నారు. రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతేమిటని రైతులు అడిగితే వారిని గుండాలు అంటున్నారని జీవన్​రెడ్డి మండిపడ్డారు. రైతులను నిందించినందుకు అర్వింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

డిపాజిట్​ కూడా దక్కకుండా ఓడిస్తా..

'పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అర్వింద్​ను నిలదీస్తున్నారు. హామీలిచ్చి తప్పించుకుంటే భాజపా నేతలను నిలదీయకుంటే ఏం చేస్తారు..? రైతులే కాకుండా.. కల్యాణలక్ష్మీతో లబ్ధి పొందిన మహిళలు కూడా అర్వింద్​కు చెప్పులతో స్వాగతం చెబుతారన్నారు. కేసీఆర్​ను తిడితే అభిమానులు కచ్చితంగా తిరగబడుతారు. సీఎం కేసీఆర్ మాకు దాడుల సంస్కృతి నేర్పించలేదు. మేము నిజంగానే దాడికి పిలుపునిస్తే అర్వింద్ నిజామాబాద్ వెళ్లి తిరిగి రాగలడా..? ఆర్మూర్​లో పోటీ చేస్తానన్న అర్వింద్ సవాల్​ను స్వాగతిస్తున్నా. అర్వింద్​కు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తా." -జీవన్​రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు విసరడం ఆపి.. దమ్ముంటే దిల్లీకి వెళ్లి పసుపు బోర్డు తీసుకురావాలని జీవన్​రెడ్డి డిమాండ్ చేశారు. అర్వింద్​తో చర్చించడం కన్నా.. అసెంబ్లీ చప్రాసితో చర్చించడం మంచిదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు భాజపాకు తమ పవర్ ఏమిటో చూపిస్తున్నారన్నారు. భాజపాలో దుష్టచతుష్టయం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతొందని జీవన్​రెడ్డి ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.