ETV Bharat / city

'ఆర్టీసీ కార్మికులకు రూ.50 లక్షల కరోనా బీమా' - ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా బీమా

ఏపీఎస్​ ఆర్టీసీ కార్మికులకు రూ.50 లక్షల కరోనా బీమా వర్తింపజేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీలో కరోనా సోకి ఇప్పటి వరకు 36 మంది మృతిచెందారు. ఈనేపథ్యంలోనే తమకి బీమా వర్తింపజేయాలని కార్మికులు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబుకు వినతి పత్రం అందించారు. దీంతో ఆర్టీసీ ఎండీ ప్రభుత్వంతో చర్చించారు.

apsrtc-announced-50-lakh-covid-insurance-to-employees
'ఆర్టీసీ కార్మికులకు రూ.50 లక్షల కరోనా బీమా'
author img

By

Published : Aug 19, 2020, 8:03 PM IST

ఏపీఎస్​ ఆర్టీసీ కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకు రూ.50 లక్షల చొప్పున కొవిడ్ బీమా వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది తరహాలోనే వీరికి బీమా వర్తించనుంది. ఆర్టీసీలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 36 మంది మృత్యువాతపడ్డారు. నిరంతరం పలు ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తూ వైరస్ బారిన పడుతుండటంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న ఆర్టీసీ కార్మికులకు బీమా వర్తింప జేయాలని కార్మిక పరిషత్ నేతలు సహా కార్మికులు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులకూ కొవిడ్ బీమా వర్తింప జేసి కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించారు.

52 వేల మందికి వర్తింపు

కార్మికుల వినతిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ.. ప్రభుత్వంతో చర్చించారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు బీమా వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీలోని 52 వేల మంది ఉద్యోగులకు కొవిడ్ బీమా వర్తించనుంది. ఆర్టీసీలో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన 36 మందికి బీమా వర్తింపజేసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంది. మృతి చెందిన ఉద్యోగుల వివరాలు సహా తగిన ధ్రువపత్రాలు పంపాలని అన్ని జిల్లాల ఆర్ ఏంలకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ లోపు అన్ని ధ్రువపత్రాలను ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎండీ ఆదేశాల్లో తెలిపారు. కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయడంపై ఆర్టీసీ ఎండీకి కార్మిక పరిషత్ సహా ఇతర సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి.

ఇదీ చదవండి : రాజధాని ఏర్పాటు మా పరిధిలోనిది కాదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.