Telangana PG medical admissions 2022 : నీట్ పీజీ కటాఫ్ మార్కులను తగ్గించిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పీజీ వైద్య సీట్ల ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి ప్రవేశ ప్రకటనను బుధవారం విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17న(గురువారం) ఉదయం 6 గంటల నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, పరిశీలన అనంతరం తుది అర్హుల జాబితాను విడుదల చేస్తామని పేర్కొంది.
వైద్యవిద్య సీట్ల పెంపునకు దరఖాస్తుల ఆహ్వానం
ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతమున్న సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి వైద్య కళాశాలల నుంచి జాతీయ వైద్య కమిషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేసిన కళాశాలలు మాత్రమే సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.