వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. 2020 జనవరిలో డీసీఎంఎస్‌లో కందులను రైతులు విక్రయించారని ఇప్పటివరకు రావాల్సిన రూ. 73 లక్షలు అందలేదన్నారు. 123 మంది కంది రైతులకు న్యాయం చేసి.. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కలెక్టర్‌పై కూడా అనుమానాలున్నాయని పిటినషర్ తెలిపారు. కలెక్టర్‌తో పాటు స్థానిక రాజకీయ నాయకులు, పలువురు పాత్రికేయుల ప్రమేయం ఉందని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదీ చదవండిః కందుల సొమ్ము కాజేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ వినతి