ETV Bharat / city

ఆప్కో సంస్థ షోరూంలుగా మారనున్న అన్న క్యాంటీన్లు.. - ఏపీలోని అన్న క్యాంటీన్ల వార్తలు

ఏపీలోని అన్న క్యాంటీన్లను ఆప్కో సంస్థ వాడుకోనుంది. క్యాంటీన్లలో ఉన్న గదులను షోరూంగా మలిచి.. తమ ఉత్పత్తులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 109 ఆప్కో షోరూంలతోపాటు అదనంగా మరో 50 ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

apco-handloom-showrooms-will-establish-in-anna-canteen
ఆప్కో సంస్థ షోరూంలుగా మారనున్న అన్న క్యాంటీన్లు..
author img

By

Published : Feb 20, 2021, 2:25 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో అన్నక్యాంటీన్లలో షోరూంల ఏర్పాటుకు ఆప్కో అధికారులు మొగ్గు చూపుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండి మార్కెటింగ్‌కు అవకాశమున్న ప్రాంతాల్లోని క్యాంటీన్లలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వినియోగంలో లేని అన్న క్యాంటీన్లను కేటాయించాలని పురపాలక శాఖకు ఆప్కో అధికారులు విన్నవించారు.

వీటితోపాటు పురపాలక సంఘాలకు చెందిన కాంప్లెక్స్‌ల్లో షోరూంల ఏర్పాటుకు ప్రత్యేక గదులు కేటాయించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 109 ఆప్కో షోరూంలతోపాటు అదనంగా మరో 50 ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం చేనేత వస్త్రాలు, చీరలు, డ్రెస్‌మెటీరియల్స్‌ అత్యధికంగా నేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సంప్రదాయ డిజైన్లు కాకుండా కొత్త వెరైటీలను అందుబాటులోకి తెస్తున్నారు. వీటితోపాటు యువత ఆసక్తికి తగ్గట్టు కొత్తగా డ్రెస్‌లు, చుడీదార్లు, చొక్కాలు అందుబాటులో ఉంచనున్నారు.

వీటి తయారీ ఇప్పటికే మొదలైంది. నాణ్యత ఉండటంతోపాటు ప్రైవేటు మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 15నాటికి అన్ని షోరూంల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు.

ఇదీ చూడండి: ఈనెల 22న బల్దియా మేయర్, ఉపమేయర్​ బాధ్యతల స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.