వందే భారత్ మిషన్ రెండో దశలో భాగంగా విదేశాల్లోని 3400 మంది భారతీయులను హైదరాబాద్‌కు తరలించారు. మే 18 నుంచి ఈనెల 2వరకు మొత్తం 23 ప్రత్యేక విమానాలు నడిపినట్లు అధికారులు తెలిపారు. సుమారు 3400 మంది భారతీయులను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
కువైట్, అబుదాబి, దుబయ్, సింగపూర్, జెడ్డా, దమామ్, దొహ్, శాన్ ప్రాన్సిస్కో, రియాద్, మెల్‌బోర్న్, టోరంటో తదితర దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
స్వదేశానికి తీసుకువచ్చిన వారందరికీ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు కస్టమ్స్ సిబ్బంది పేర్కొన్నారు. అధికారులంతా వ్యక్తిగత పరిరక్షణ కిట్లు(పీపీఈ) ధరించి విధులు నిర్వహించినట్లు వివరించారు.
ఇవీచూడండి: డ్రోన్ కెమెరాలతో నిఘా.. పరుగులు తీసిన యువత