AP corona cases: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 26,236 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,891 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో ఐదుగురు మరణించారు. కరోనా నుంచి నిన్న 10,241 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 54,040 యాక్టివ్ కేసులున్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
-
#COVIDUpdates: 08/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,06,943 పాజిటివ్ కేసు లకు గాను
*22,38,226 మంది డిశ్చార్జ్ కాగా
*14,677 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 54,040#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/b3SCJI4jps
">#COVIDUpdates: 08/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 8, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,06,943 పాజిటివ్ కేసు లకు గాను
*22,38,226 మంది డిశ్చార్జ్ కాగా
*14,677 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 54,040#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/b3SCJI4jps#COVIDUpdates: 08/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 8, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,06,943 పాజిటివ్ కేసు లకు గాను
*22,38,226 మంది డిశ్చార్జ్ కాగా
*14,677 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 54,040#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/b3SCJI4jps
దేశంలో సైతం తగ్గిన కొవిడ్ కేసులు..
Covid Cases in India: భారత్లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జరిపిన 13,46,534 పరీక్షల్లో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,118 మంది మరణించారు. 1,80,456 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,23,39,611
- మొత్తం మరణాలు: 5,04,062
- యాక్టివ్ కేసులు: 9,94,891
- మొత్తం కోలుకున్నవారు: 4,08,40,658
దేశంలో కొత్తగా 55,78,297 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,70,21,72,615 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీచూడండి: DH on Corona Third Wave: 'కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది.. ఎలాంటి ఆంక్షల్లేవు'