ETV Bharat / city

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండోవిడత పోలింగ్ - ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు న్యూస్

ap panchayat elections
ap panchayat elections
author img

By

Published : Feb 13, 2021, 4:40 PM IST

16:30 February 13

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండోవిడత పోలింగ్

ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 13 జిల్లాల్లోని 2,786 పంచాయతీల్లో రెండోదశలో పోలింగ్‌ జరిగింది.  ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు కదిలారు. మధ్యాహ్నం రెండున్నరకే రాష్ట్రవ్యాప్తంగా 76శాతం పోలింగ్‌ నమోదైంది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా మధ్యాహ్నం రెండున్నరకు 81శాతం మంది ఓటు వేశారు. విశాఖపట్నం జిల్లాలో 79.81శాతం, ప్రకాశం, గుంటూరు జిల్లాలో 78శాతం ఓటింగ్‌ నమోదైంది. 

రెండోదశలో 2,786 సర్పంచ్ స్థానాలకు పోటీ పడతున్న 7,507 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు పూర్తికాగానే వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. రెండోవిడతలో 539 పంచాయతీలు, 12,604 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా చూస్తే రెండో విడత ఎన్నికలు ఇప్పటివరకు ప్రశాతంగా సాగాయి. కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుంది. 

గుంటూరు జిల్లా మారెల్లవారిపాలెం, నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పోలింగ్‌ నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకే పోలింగ్ ముగిసింది.

ఇదీ చదవండి: పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 12.30 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.