ETV Bharat / city

roja on indigo : ఇండిగో వేధింపులపై కోర్టుకు వెళతాం : ఎమ్మెల్యే రోజా - ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Flight Diverted: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి మళ్లించారు. చివరికి రూటు మార్చి బెంగళూరులో ల్యాండయ్యాక ఒక్కొక్కరు రూ.5వేలు కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఇండిగో ఉద్యోగుల వ్యవహార శైలి పట్ల రోజా అసహనానికి గురయ్యారు. వేధింపులపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

roja on indigo
roja on indigo
author img

By

Published : Dec 14, 2021, 5:13 PM IST

Indigo Flight Diverted : ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై ఏపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. రేణిగుంటకు రావాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు బెంగళూరుకు మళ్లించారు. అయితే ఒక్కొక్కరు రూ.5వేలు కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్‌ చేయగా.. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తామని రోజా తెలిపారు.

"ఒక్కొక్కరు రూ.5వేలు కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఇది కరెక్ట్‌ కాదు. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తాం"

-రోజా, ఏపీ ఎమ్మెల్యే

ఇండిగో సిబ్బంది వ్యవహారంపై కోర్టుకు వెళతాం: ఎమ్మెల్యే రోజా

ఇదీ జరిగింది:

సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాజమహేంద్రవరం-తిరుపతి ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. రేణిగుంటకు రావాల్సిన విమానాన్ని అధికారులు బెంగళూరుకు మళ్లించారు. విమానంలో ఎమ్మెల్యే రోజా సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. మెుత్తంగా విమానంలో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డోర్స్ ఓపెన్​ అవట్లేదని.. ఇంకా ఎలాంటి సూచనలు రాలేదని రోజా తెలిపారు.

ఇదీ చూడండి: Flight Diverted: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.