ETV Bharat / city

గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనా పరిస్థితి మారలేదు: హైకోర్టు - డీజీపీపై హైకోర్టు ఆగ్రహం వార్తలు

పోలీసు వ్యవస్థ తీరుపై హైకోర్టు మరోసారి.. అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు చెప్పినా.. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది. గతంలో డీజీపీ హైకోర్టు ఎదుట హాజరైనా.. పరిస్థితి మారలేదని వ్యాఖ్యానించింది.

గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనా పరిస్థితి మారలేదు: హైకోర్టు

author img

By

Published : Sep 14, 2020, 9:46 PM IST

ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారంటూ... దాఖలైన పిటిషన్​పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే.. అసలు సహించేది లేదని.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో గ్రామానికి చెందిన వెంకటరాజు అనే వ్యక్తిని పోలీసులు అపహరించారంటూ.. అతడి మేనమామ నారాయణ స్వామి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వెంకట్రాజును పోలీసులు తీసుకెళ్లారంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్​పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లపై రేపు విచారణ జరపనుంది.

ఏపీలో రూల్ ఆఫ్​ లా అమలు కావడం లేదు. వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించబోం. గతంలో డీజీపీ కోర్టు ఎదుట హాజరైనా.. పరిస్థితిలో మార్పు రాలేదు.

-హైకోర్టు

గతంలో డీజీపీ ఎందుకు హాజరయ్యారంటే?

వాహనాల జప్తునకు సంబంధించిన కేసులో గతంలో డీజీపీ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించట్లేదని అప్పుడు పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని న్యాయస్థానం స్వయంగా డీజీపీ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మద్యం అక్రమ రవాణా చేస్తూ జప్తునకు గురైన వాహనాలను సంబంధిత మెజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ముందు ఎందుకు ఉంచడం లేదో డీజీపీ వివరణ ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు గౌతం సవాంగ్ హైకోర్టు ఎదుట హాజరయ్యారు.

విజయవాడకు చెందిన దంపతులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని.. గతంలో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలను సరిగ్గా అమలు పరచలేదంటూ.. రాష్ట్ర డీజీపీని హాజరు కావలసిందిగా హైకోర్టు గతంలోనూ ఆదేశించింది.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.