50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవోలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 శాతం జీతం ఇస్తూ ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ.. విశాఖకు చెందిన విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ కామేశ్వరి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను 12 శాతం వడ్డీతో సహా రెండు నెలల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కొవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో పిటిషన్‌పై విచారించిన ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేసింది.
ఇవీచూడండి: వైద్య పరికరాల తయారీలో 'మెడ్‌ట్రానిక్స్' రూ.1,200 కోట్ల పెట్టుబడి