ETV Bharat / city

'జగన్​ సర్కార్​ తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఏపీ హైకోర్టు' - High Court comments ycp government

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేల కోట్లు ఖర్చుచేసి ఇప్పుడు తరలిస్తామనడం ప్రభుత్వ మతిలేని చర్య కాదా అని ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. చాలా భవనాలను ఎక్కడివక్కడ వదిలేయడాన్ని రోజూ చూస్తుంటే... హృదయం ద్రవించిపోతోందని వ్యాఖ్యానించింది. ప్రజల సొమ్మును అలా వృథా చేస్తే బాధపడేది వారే కదా అని నిలదీసింది. నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం ఉండాల్సిందేనని, లేకుంటే ఉన్నత పదవుల్ని అధిరోహించి ప్రజాస్వామ్యాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటారని... హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

జగన్​ సర్కార్​ తీరును తప్పుబట్టిన ఏపీ హైకోర్టు

author img

By

Published : Nov 21, 2020, 12:51 PM IST

పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా... ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజాచైతన్య యాత్రకు పోలీసుల అనుమతితో విశాఖ వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు... 151 సీఆర్​పీసీ నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయడం, ప్రతిపక్షం చేపట్టే ర్యాలీలు, సమావేశాలను పోలీసులు అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.

మతిలేని చర్య అనడంపై అభ్యంతరం...

ఈ సందర్భంగా పోలీసుల తరఫున వాదనలు వినిపించిన ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్​ఎస్​ ప్రసాద్... పిటిషనర్‌ అఫిడవిట్‌లో ప్రస్తుత ప్రభుత్వ మతిలేని చర్యపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతిపక్షనేత యాత్ర చేపట్టారని పేర్కొన్నట్లు ప్రస్తావించారు. మతిలేని చర్య అనడంపై అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.... రాజధాని అమరావతిలో పనులు నిలిపేయడాన్ని గుర్తుచేస్తూ... అది ప్రభుత్వ మతిలేని చర్య కాదా అని ప్రశ్నించింది. అమరావతి అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసి ప్రస్తుతం తరలిస్తామనడం ప్రభుత్వ మతిలేని చర్య కాదా అని నిలదీసింది.

మతిలేని చర్య అని పేర్కొంటే తప్పేంటి..?

రాజధాని కోసం 3 వేల కోట్లు ఖర్చు చేశాక ఎక్కడి పనులు అక్కడే నిలిపేయడం ఏంటని ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ సొమ్మంతా ప్రజలదని.. పనులు నిలిపేయడంతో అంతిమంగా వ్యథకు గురయ్యేది వారేనని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో చాలా భవనాలు నిర్మించి మధ్యలో వదిలేశారని... ఇప్పటి వరకు ఖర్చు చేసినదంతా ప్రభుత్వానికి, ప్రజలకు జరిగిన నష్టమా, కాదా అని అడిగింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు... పిటిషనర్‌ తన అఫిడవిట్లో ప్రస్తుత ప్రభుత్వం మతిలేని చర్య అని పేర్కొంటే తప్పేంటని ప్రత్యేక సీనియర్‌ కౌన్సిల్‌ను ప్రశ్నించింది.

నిబంధనలు పాటించరా..?

భూములు ఖాళీ చేయించకుండా రెవెన్యూ అధికారుల్ని నిలువరించాలంటూ దాఖలైన పలు వ్యాజ్యాల్లో చట్ట నిబంధనలు అనుసరించాలని తామే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది. నిబంధనలు పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించడం రాష్ట్ర ప్రభుత్వ మతిలేని చర్య కాదా అని ప్రశ్నలు సంధించింది. ప్రజాచైతన్య యాత్రకు విశాఖ వెళ్లిన చంద్రబాబుకు సీఆర్​పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసిచ్చి అరెస్ట్‌ చేయడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం... అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ స్థాయి అధికారి చట్ట నిబంధనలు పాటించకపోవడం ఏంటని ప్రశ్నించింది.

డిస్మిస్‌ చేయాలి..

క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని సీనియర్‌ కౌన్సిల్‌ తెలపగా... డిస్మిస్‌ చేయాలని పేర్కొంది. ర్యాలీలు, సమావేశాల సమయంలో భద్రత కల్పించాల్సింది పోలీసులేనని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు... విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అందులో కోర్టులు జోక్యం వద్దు...

ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్‌ కౌన్సిల్‌.... తాను రాజధాని కేసుల్లో వాదనలు వినిపించే న్యాయవాదిని కాదని అన్నారు. అలాగే ఆ వ్యాజ్యాల్ని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో మీరు జడ్జిగా లేరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని విషయం పూర్తిగా ప్రభుత్వ పరిపాలనాపరమైన అంశమని, అందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. విచారణాధికార పరిధి, పాత్రను కోర్టులు మరిచిపోతున్నాయని అన్నారు.

వ్యక్తిగత బాధతో...

ఆ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ధర్మాసనం.... మీ ప్రభుత్వం మాత్రం సమాజ అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్ని పనులూ చేస్తోందా అని ప్రశ్నించింది. తాను కోర్టుకు వచ్చేటప్పుడు నిర్మాణ పనులు నిలిచిపోయిన భారీ భవంతులను చూస్తుంటే... ఆశ్చర్యంతోపాటు బాధ కూడా కలుగుతోందని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. సౌకర్యాల లేమితో సిబ్బంది, న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారనే వ్యక్తిగత బాధతో ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు.

రాజధాని ఇక్కడే ఉంటే నష్టం...

దీనిపై స్పందించిన సీనియర్‌ కౌన్సిల్‌... హైకోర్టు ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎడారికి వెళ్లినట్లు అనిపిస్తుందన్నారు. చీకటిపడితే వెనక్కి రావడం కష్టమనిపిస్తుందని, అక్కడ నీళ్లు లేవని, టీ దొరకదని, న్యాయవాదులు మధ్యాహ్నం భోజనం చేయడానికి సౌకర్యం కూడా లేదని అన్నారు. అస్వస్థతకు గురైతే చికిత్సకు ఆసుపత్రి లేదని ప్రస్తావించారు. చుట్టుపక్కల ఏమీలేని ప్రాంతానికి గత పరిపాలనా యంత్రాంగం ఎందుకెళ్లిందో తెలియదని... రాజధాని ఇక్కడే ఉంటే నష్టం రూ.100 కోట్లు ఉంటే, తరలిస్తే 10 కోట్లు మాత్రమే ఉంటుందని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ దాఖలుచేసిన పిల్‌కు విచారణార్హత లేదన్న సీనియర్ కౌన్సిల్.... అది రాజకీయ ప్రయోజన వ్యాజ్యమని అన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ధర్నాలు, నిరసనలు చేపట్టిన వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని, అలా జరగకపోవడం వల్లే వారు కోర్టుకొస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టుకు వచ్చే మార్గంలో నల్లజెండాలతో నిలబడుతున్న కొంతమందని పోలీసులు అనుమతించొచ్చా అని ప్రశ్నించింది.

పిటిషనర్లపై దాడి చేస్తున్న ఘటనలు

సమస్యలపై వ్యాజ్యాలు వేస్తే పిటిషనర్లపై దాడి చేస్తున్న ఘటనలు, పిటిషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్న విషయాలు తమ దృష్టికి వస్తున్నాయని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రజాహిత వ్యాజ్యాల ఉపసంహరణకు అనుమతించబోమని స్పష్టంచేసింది. ప్రజలు ఉద్వేగంతో ఉంటారని సీనియర్‌ కౌన్సిల్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించగా... సాధారణ ప్రజలు అలాంటి వాటికి పాల్పడరని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆ వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకు రావా?

హైకోర్టు తీర్పు ఇస్తే పార్లమెంట్‌ సభ్యుడు టీవీ ముందుకెళ్లి ఆరోపణ చేయడం ఏంటని ఆగ్రహించింది. తీర్పు నచ్చకపోతే సరిగా లేదని చెప్పడం పరిపాటేనని, ఆ చర్య కోర్టు ధిక్కరణ కిందకు రాదని సీనియర్‌ కౌన్సిల్‌ అనడంతో... ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఒక రాజకీయ పార్టీకి బ్రాంచ్‌ ఆఫీసుగా మారిపోయిందని అంటారా, ఇది తీర్పు బాగా లేదనడమా అని నిలదీసింది. ఆ వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకు రావా, ప్రజాస్వామ్య దేశంలో ఇదేనా పద్ధతి అని ప్రశ్నలు వేసింది.

రాజధాని తరలించొద్దని ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మందడం గ్రామానికి వస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న అంశం హైకోర్టులో చర్చకు రాగా... ఆయన భారీ కాన్వాయ్‌తో రైతుల వద్దకు చేరుకున్నట్లు సీనియర్‌ కౌన్సిల్‌ తెలిపారు. ప్రతి రాజకీయ నేత జన బలగాన్ని చూపాలనుకుంటున్నారని చెప్పారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీఅయినా అంతేనన్న జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌... బిహార్‌లో ఓ ఘటనను ఉదహరించారు.

ఓ సాధారణ వ్యక్తి సర్పంచి స్థాయికి చేరుకున్న రెండు మూడు నెలల్లోనే పెద్ద కార్లలో తిరిగేవారని, తర్వాత కొద్ది రోజులకు ధనవంతుడయ్యారని అన్నారు. ఇలాంటి వాటని కట్టడి చేయాలన్నారు. నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించేలా తప్పనిసరిగా చట్టం ఉండాలని, లేకపోతే వారంతా ఉన్నత పదవుల్ని అధిరోహించి ప్రజాస్వామ్యాన్ని నచ్చినట్లు వాడుకుంటారని... జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్యూన్‌ పోస్టు భర్తీ చేయాలన్నా విద్యార్హతలు చూస్తారని, నేర చరిత్రపై ఆరా తీస్తారని... ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం వాటన్నింటితో పనిలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు.

ప్రజాస్వామ్యంలో లోపం..

నేరస్థులు అధికారంలోకి రాకుండా నిలువరిస్తూ చట్టాలు చేసే విషయంలో ఎవరూ జాగ్రత్త వహించడం లేదన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు సైతం అంటోందని, ఇలాంటి ఓ విషయంలో తాను ఇబ్బంది పడ్డానంటూ... పప్పూయాదవ్ అంశాన్ని ప్రస్తావించారు. హత్యకేసులో నిందితుడిగా జైల్లో ఉన్న పప్పూయాదవ్‌... బిహార్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అధ్యయనం చేశానని తెలిపారు. జైల్లో ఎంతకాలం ఉంటారో అంతకాలం ఓటు హక్కును సస్పెండ్‌ చేయవచ్చనే నిబంధన ఉందికానీ... జైల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారికి ఎలాంటి నిబంధనలూ లేకపోవడమే ప్రజాస్వామ్యంలో లోపమని అన్నారు.

ఎంతో కష్టపడి ఐఏఎస్​, ఏపీఎస్​లు అయిన అధికారులు... నేరస్థులైన ప్రజాప్రతినిధుల ఆజ్ఞలకు కట్టుబడి ఉండాల్సి వస్తోందన్నారు. బిహార్‌లో ఓ నేరస్థుడు ఎన్నికల్లో గెలిచి హోంమంత్రి అయ్యారని... ఆయనకు సెల్యూట్‌ చేయాల్సి వస్తోందని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో నేర ప్రవృత్తికి అడ్డుకట్ట వేసే విషయంలో ఏదో ఒకటి జరగకపోతే... క్రిమినల్స్‌ పాలించే రోజు వస్తుందని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవీ చూడండి: బతికున్నోడిని చంపేశారు... చనిపోయినోడిని పట్టించుకోవట్లేదు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.