HC on Special Status: చట్ట సభల్లో ప్రధాని ఇచ్చిన హామీని, ఎన్నికల సమయంలో నేతలిచ్చిన హామీలు, బడ్జెట్ ప్రసంగ హామీలను అమలు చేయాలని.. న్యాయస్థానాల్ని కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని తెలిపింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపడం లేదని వ్యాఖ్యానించింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదంటూ.. అమలాపురానికి చెందిన న్యాయవాది రమేశ్ చంద్ర వర్మ హైకోర్టులో పిల్ వేశారు.
అప్పటి ప్రధాని పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఓసారి హామీ ఇచ్చి వెనక్కి తగ్గడానికి వీల్లేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. హామీలు అమలు చేయాలని కోర్టులను కోరలేరని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది
ఇదీ చదవండి: CJI Justice NV Ramana : స్వాతంత్య్రోత్సవ జాతీయ కమిటీలో సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ