ETV Bharat / city

ఏపీ ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్‌ పిటిషన్.. విచారణ 18కి వాయిదా

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్​పై విచారణ వాయిదా పడింది. ఈనెల 18కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

author img

By

Published : Jan 12, 2021, 7:59 PM IST

ఏపీ ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్‌ పిటిషన్.. విచారణ 18కి వాయిదా
ఏపీ ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్‌ పిటిషన్.. విచారణ 18కి వాయిదా

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్​పై విచారణ వాయిదా పడింది. ఈనెల 18కి వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం.... డివిజన్ బెంచ్​ ముందు ఈ రిట్ అప్పీల్ దాఖలు చేసింది.

సింగిల్ బెంచ్ ఉత్తర్వులు...

పంచాయతీ ఎన్నికల నిమిత్తం షెడ్యూల్‌ ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఏపీ ఎస్‌ఈసీ) ఈ నెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను ఏపీ హైకోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఈసీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న కరోనా టీకా కార్యక్రమానికి, దాన్ని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి.. ఎస్‌ఈసీ నిర్ణయం ప్రతిబంధకంగా మారుతుందని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయం.. అధికరణ 14, 21లను ఉల్లంఘించేదిగా ఉందని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని ఆక్షేపించింది. సంప్రదింపుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కమిషన్‌ నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడింది.

డివిజన్ బెంచ్​లో రిట్ అప్పీల్...

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. నిర్దేశించిన చట్ట నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులున్నాయని పేర్కొంది. ఓసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఆ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే పలు తీర్పులున్నాయని గుర్తు చేసింది. ఎస్​ఈసీ అప్పీల్​పై వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్....తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఎస్​ఈసీ షెడ్యూల్...

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఈ నెల 8న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్​లో తేదీలను వెల్లడించారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు.ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఎస్​ఈసీ ఇచ్చిన షెడ్యూల్​ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా...సింగిల్ బెంచ్ షెడ్యూల్​ను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చదవండి: 'రైతులకు రాయితీలకన్నా నగదు బదిలీతోనే మేలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.