ఏపీలో నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్ రాజుల పేర్లను ప్రభుత్వం సూచించగా.. గవర్నర్ ఆమోదించారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్ నామినేటెడ్ అభ్యర్థుల గురించి వివరించారు. అభ్యర్థులు త్వరలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదీచదవండి: Ktr Tour: రేపు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన