ETV Bharat / city

NTR Health University: ఎన్టీఆర్ పాయే.. వైఎస్సార్​ వచ్చే.. - NTR Health University

NTR Health University: ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ మూడు దశాబ్దాలకు పైగా వైద్య విద్యను అందిస్తోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది.

NTR Health University
NTR Health University
author img

By

Published : Sep 21, 2022, 10:43 AM IST

NTR Health University: ఆంధ్రప్రదేశ్​లో ఎంతో కీలకమైన విజయవాడలోని ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే కేబినెట్​ ఆన్‌లైన్‌లో ఆమోదించింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్​ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ నేడు ఆసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. నాడు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉందని ప్రకటించిన జగన్​.. ఆయన పేరుతో జిల్లా పెట్టామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు వర్సిటీలో పేరు మాయం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వైద్య వర్సిటీతో ఎన్టీఆర్‌కు బలమైన బంధం ఉంది. వర్సిటీ ఏర్పాటు నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకు ఆయన కృషి ఉంది. మరణానంతరం పాలకులు వర్సిటీకి ఆయన పేరు పెట్టారు. సీఎంలు మారినా 24 ఏళ్లుగా అదే కీర్తి కొనసాగుతోంది. వైఎస్​కు ఏ సంబంధమూ లేకున్నా ఆయన పేరు పెట్టాలని జగన్​ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని, దీనికి గుర్తింపు తీసుకొచ్చిందీ ఎన్టీఆర్‌ అని అంటున్నారు. ఇప్పుడు ఆయన పేరుకే వైసీపీ సర్కారు మంగళం పాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎస్‌ పేరు పెట్టేందుకు రాత్రికి రాత్రే చకచకా ఏర్పాట్లు చేసింది జగన్​ ప్రభుత్వం.

అప్పట్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీలు అందజేసేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. దీంతో 1986 నవంబర్‌ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 1996 జనవరి 8న ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చారు. వైఎస్ హయాంలో 'డాక్టర్‌ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం'గా పేరు మార్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఎస్సార్​ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చనుంది. ఇటీవలే వర్సిటీ పేరిట ఉన్న రూ.400 కోట్లను సైతం ప్రభుత్వం లాగేసుకుంది.

ఇవీ చదవండి..

Safe metro city Hyderabad : అత్యంత సురక్షిత నగరాల జాబితాలో హైదరాబాద్​

క్రీడాకారిణులకు టాయిలెట్‌లో భోజనం.. వీడియో వైరల్​.. అధికారి సస్పెండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.