Rosaiah cremation: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయాన్ని కొంపల్లి ఫాంహౌస్‌కు చేరుకొంది. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ ఉదయం అమీర్‌పేటలోని రోశయ్య నివాసంలో ఆయన భౌతికకాయానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, చిరంజీవి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేమూరు ఎమ్మెల్యే నాగార్జున మాజీ మంత్రి కొండ్రు మురళి, నన్నపనేని రాజకుమారి నివాళి సహా ప్రముఖులు నివాళి అర్పించారు. రోశయ్య కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. అనంతరం అభిమానులు, ప్రజల సందర్శనార్థం గాంధీభవన్ భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. సోనియాగాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే... రోశయ్యకు నివాళి అర్పించారు. 12.30 గంటలకు గాంధీభవన్ నుంచి కొంపల్లి వరకు అంతిమయాత్ర నిర్వహించారు.
శనివారం ఉదయం కన్నమూత..
రాజకీయ కురువృద్ధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు.శనివారం ఉదయం రోశయ్య పల్స్ పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయణ్ని హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయం 8.20 గం.కు రోశయ్య మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
Konijeti Rosaiah Biography : రోశయ్య 1933 జులై 4న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ చదివారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా.. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1968లో కొణిజేటి రోశయ్య తొలిసారి మండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1968, 1974, 1980లో కాంగ్రెస్ తరఫున మండలికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీఎంలందరి వద్ద రోశయ్య పలు కీలక శాఖలు నిర్వహించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
AP Former CM Konijeti Rosaiah : రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం రోశయ్య సొంతం. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య.. 2016 ఆగస్టు 30 వరకు గవర్నర్‌గా సేవలందించారు.
ఇదీచూడండి: