ETV Bharat / city

తెదేపా నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం - తెదేపా నేత కోడెల శివప్రసాదరావు

kodela
author img

By

Published : Sep 16, 2019, 12:42 PM IST

Updated : Sep 16, 2019, 3:18 PM IST

12:41 September 16

నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఇకలేరు. డాక్టర్​గా సుపరిచితులైన కోడెల ఇవాళ హైదరాబాద్​లోని సొంత నివాసంలో  బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు సమీపంలోని బసపతారకం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి, కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు.

వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న కోడెల జన్మించారు. గుంటూరు జిల్లా సిరిపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన కోడెల.. గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు.  ఎన్టీఆర్ పిలుపుతో  1983లో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన  ఆయన గుంటూరు జిల్లాలో తిరుగులేని నేతగా నిలిచారు. 1983 నుంచి 1999 వరకు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా... 2014లో సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా  పనిచేశారు.  1987-88లో  హోంమంత్రిగా, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖమంత్రిగా, 1997-99లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా సేవలు అందించారు.

నవ్యాంధ్ర తొలి సభాపతి 

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభకు ఆయన సభాపతిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అమరావతిలో మహిళా పార్లమెంట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. 

తెదేపా శ్రేణుల్లో విషాదం

ఫైర్​బ్రాండ్ నేతగా గుర్తింపు ఉన్న కోడెల మరణంతో తెదేపా శ్రేణుల్లో విషాదం  అలముకుంది. నర్సరావుపేట, సత్తెనపల్లిలోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. 
 
Intro:ap_atp_61_16_stampula_koratha_avb_ap10005
_________________*
స్టాంపుల కొరత.. రైతులు, రుణ గ్రహీతల ఇబ్బందులు...
------------–*
అన్ని రకాల రైతు రుణాలకు వివిధ రకాల ఇతర బ్యాంకు రుణాలకు అవసరమైన స్టాంపుల కొరత ఉండటంతో 15 రోజులుగా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం వందలాది మంది రైతులు, రుణ గ్రహీతలు తమ అప్పులను రీషెడ్యూల్ చేయించుకోవడానికి బ్యాంకు వారు సూచించిన మొత్తంలో స్టాంపులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాంపులు అతికించడం ఒకరకమైతే అధికారికంగా రుణం పొందే పత్రంపై సబ్ రిజిస్టర్ వారు వేసే ముద్ర ఇంకోరకం.. ఈ రెండు రకాలు కళ్యాణదుర్గం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో బ్యాంకు రుణ గ్రహీతలు అన్నదాతలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆచారి అడగా ప్రింటర్ కు అవసరమైన రిబ్బన్ కోసం ఆర్డర్ పెట్టామని ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు..Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Sep 16, 2019, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.