ETV Bharat / city

ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: ఈసీకి సీఎస్ లేఖ - ఏపీ తాజా రాజకీయాలు

ఏపీ సీఎస్ నీలం సాహ్ని.. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​కు లేఖ రాశారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్‌ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: ఈసీకి సీఎస్ లేఖ

author img

By

Published : Nov 18, 2020, 9:47 AM IST

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు.. ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు. కరోనా కేసుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు.. వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని‌ నీలం సాహ్ని సూచించారు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని గుర్తుచేశారు. ఏపీలో 6,890 మంది కరోనా వల్ల మృతిచెందారన్న సీఎస్.. మరోసారి కరోనా ప్రబలేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పరిపాలన సిబ్బంది కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడికి పోలీసు సిబ్బంది, వివిధ శాఖలు కృషిచేస్తున్నాయన్నారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎస్‌ఈసీకి ఎన్నికల నిర్వహణపై సమాచారం అందిస్తామని తెలిపారు.‌

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని నీలం సాహ్నీ లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సరికాదన్నారు. ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చారన్న సీఎస్‌.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని భావిస్తున్నామని అన్నారు.

ఇదీ చదవండి: మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.