ఏపీలో కరోనా మహా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు) 57,685 మందిని పరీక్షించగా 9,742 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,003కి చేరినట్టు బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 86 మంది కొవిడ్‌తో మృతిచెందినట్లు తెలిపింది. చిత్తూరులో 15, నెల్లూరు 15, అనంతపురంలో 8, గుంటూరులో 5, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, తూర్పుగోదావరి 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, పశ్చిమగోదావరి 5, కడప 4, కృష్ణా 3, కర్నూలులో ఇద్దరు మృత్యువాత పడినట్లు బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,19,296 పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.