ETV Bharat / city

Jagan on ts ministers : 'తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు' - తెలుగు రాష్ట్ర మద్య నీటి వివాదాల వార్తలు

ap cm jagan
ap cm jagan
author img

By

Published : Jun 30, 2021, 2:51 PM IST

Updated : Jun 30, 2021, 3:47 PM IST

14:48 June 30

Jagan on ts ministers : 'తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు'

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటి వరకు మంత్రుల స్థాయిలో వాగ్యుద్ధం జరగ్గా.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. మొట్టమొదటిసారి జలజగడాలపై స్పందించారు. మంత్రివర్గ (AP CABINET))సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఏపీ, తెలంగాణ జల వివాదాలపై మంత్రివర్గ భేటీలో చర్చ సందర్భంగా.. తెలంగాణలో విద్యుదుత్పత్తి, అనుమతి లేకుండా నీటి వాడకంపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ) (KRMB) లేఖ రాయాలని అధికారులను.. సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ వివాదంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలని జగన్​ యోచిస్తున్నట్లు సమాచారం.  

అయితే జలవివాదాలు, తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఏపీ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నానని.. వారిని ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదని వ్యాఖ్యానించారు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని జగన్​ ప్రశ్నించారు. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులు, అధికారులకు జగన్‌ సూచించారు.  

తెలంగాణలో ఏపీవారు ఉన్నారని ఆలోచిస్తున్నా. ఏపీ ప్రజలను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి?. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు.  

- జగన్​, ఏపీ ముఖ్యమంత్రి

సంబంధిత కథనాలు..

Last Updated : Jun 30, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.