ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఇండియా మ్యాప్ విడుదలైంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో మ్యాప్‌లో సర్వే ఆఫ్ ఇండియా సవరణలు చేసింది. కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లద్ధాక్ ఏర్పాటైన క్రమంలో దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న కొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించలేదు. ఈ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఏపీ రాజధానిగా అమరావతి లేని మ్యాప్‌ను విడుదల చేయటం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సవరణలు చేసిన నూతన మ్యాప్‌ను సర్వే ఆఫ్ ఇండియా ఇవాళ విడుదల చేసింది.
ఇదీ చూడండి: 30 మంది గూండాలు, 60 కత్తిపోట్లు...ఆరోజు అసలేం జరిగింది!?