ఏపీలో కొత్తగా 9,536 కరోనా కేసులు నమోదయ్యాయి. 66 మరణాలు సంభవించాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,67,123కి చేరింది. వైరస్ మహమ్మారితో ఇప్పటివరకు 4,912 మంది మృతి చెందారు. ప్రస్తుతం 95,072 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ నుంచి 4,67,139 మంది బాధితులు కోలుకున్నారు.
![ఏపీలో కొత్తగా మరో 9,536 కేసులు.. 66 మరణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8788719_corona-ap.jpg)
తాజాగా 72,233 పరీక్షలు..
తాజాగా రాష్ట్రంలో 72,233 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 45,99,826 కరోనా పరీక్షలు చేసినట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : యాదాద్రి ప్రగతిని పరిశీలించిన సీఎం... అధికారులకు సూచనలు