ఏపీకి మరో 3.24 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి టీకా డోసులు విజయవాడకు తరలించారు.
తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన అధికారులు.. ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. కొరత ఉన్న వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు టీకాలను తరలిస్తామని అధికారులు తెలిపారు.
- ఇదీ చదవండి : TPCC: రేవంత్ నియామకంపై హస్తం పార్టీలో అసమ్మతి సెగలు