ETV Bharat / city

గుడ్​న్యూస్.. రాష్ట్రానికి మరో 150 ఎంబీబీఎస్‌ సీట్లు

MBBS Seats in Telangana : రాష్ట్రానికి మరో 150 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యాయి. జగిత్యాల వైద్య కళాశాలకు ఈ సీట్లు కేటాయిస్తూ జాతీయ వైద్య కమిషన్‌ ఆమోదం తెలిపింది. మిగిలిన 7 కళాశాలలకూ త్వరలోనే అనుమతులు వస్తాయని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

MBBS seats
MBBS seats
author img

By

Published : Jun 15, 2022, 7:56 AM IST

MBBS Seats in Telangana: తెలంగాణకు మరో 150 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించారు. జగిత్యాలలో కొత్తగా నెలకొల్పిన ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అనుమతించింది. దీంతో ఈ సీట్లు జతయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వైద్య విద్య సంవత్సరంలో కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. జగిత్యాల సహా సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో వైద్య కళాశాలల నిర్మాణానికి (రూ.510 కోట్ల చొప్పున) ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ 8 కళాశాలల్లో తొలి విడత ఎన్‌ఎంసీ తనిఖీల ప్రక్రియ పూర్తయింది. లోపాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక పంపగా.. వాటిని సవరించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత తనిఖీలకు ఆహ్వానించింది.

ఇందులో భాగంగా జగిత్యాలలో తనిఖీ నిర్వహించిన ఎన్‌ఎంసీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాలకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మంగళవారం అధికారికంగా లేఖ పంపింది. మిగిలిన 7 కళాశాలల్లో కొన్నింటిలో ఇప్పటికే రెండో విడత తనిఖీలు పూర్తికాగా.. మరికొన్నింటిలో ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వైద్యవర్గాలు తెలిపాయి. అన్ని కళాశాలలకూ ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు వస్తాయని, 2022-23 విద్యా సంవత్సరం నుంచే ఈ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎక్కడైనా పనులు అసంపూర్తిగా ఉన్నా వాటికి సంబంధించి ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరిస్తుందని, ఆ వైద్య కళాశాలల ప్రారంభానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆ వైద్యాధికారి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.