ETV Bharat / city

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ నేడే - సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. అనంతరం మృత్సంగ్రహణ యాత్ర చేపడతారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ నేడే

author img

By

Published : Sep 26, 2022, 10:37 AM IST

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వర స్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవి పూజ అనంతరం మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఈ మృత్సంగ్రహణ యాత్ర తర్వాత మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేస్తారు. దీన్నే అంకురార్పణగా పేర్కొంటారు.

ఇవీ చదవండి..:

నేడు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి.. రాష్ట్రమంతా వేడుకలు..

మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.