ETV Bharat / city

రెండేళ్లుగా మందగించిన ఏపీ ఆర్థిక వృద్ధిరేటు - ఏపీ జీడీపీ వార్తలు

ఆంధ్రప్రదేశ్​ వృద్ధిరేటు గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా మందగించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించింది.

andhrapradesh-state-growth-rate-has-slow-downed-for-the-past-two-fiscal-years
రెండేళ్లుగా మందగించిన ఏపీ ఆర్థిక వృద్ధిరేటు
author img

By

Published : Jun 19, 2020, 2:43 PM IST

ఆంధ్రప్రదేశ్​ వృద్ధిరేటు గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా మందగించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించింది. ఏ రాష్ట్ర అభివృద్ధినైనా గణించేందుకు ఆ రాష్ట్ర ఆదాయమే కీలక సూచీ. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఇందుకు అద్దం పడుతుంది.

2015-16 నుంచి 2019-20 వరకు స్థూల ఉత్పత్తిలో పెరుగుదల రేటు చివరి రెండేళ్లలో మందగించింది. వృద్ధిరేటు అంతకుముందు మూడేళ్ల కన్నా చివరి రెండేళ్లలో తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధిరేటు అంతకు ముందు సంవత్సరం కన్నా ఎక్కువగా ఉన్నా ఇది అంతకు ముందు మూడేళ్లనూ పరిశీలిస్తే తక్కువే.

* వృద్ధి రేటు అంటే అంతకుముందు ఏడాది కన్నా ఆదాయం ఎంత పెరిగిందో శాతాల్లో లెక్కిస్తారు.

వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగాలు..

స్థూల ఉత్పత్తి లెక్కింపులో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలదే కీలకపాత్ర. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2015-16 నుంచి 19-20 వరకు వరుసగా 8.31%, 14.98%, 18.29%, 3.84%, 19-20కి 8.60% వృద్ధిరేటును అంచనా వేశారు.
* పారిశ్రామిక రంగంలో వరుసగా 10.74%, 12.48%, 5.03%, 0.01%, 5.67% వృద్ధి రేటును లెక్కించారు. చివరి మూడేళ్లలో తగ్గింది.
* సేవా రంగంలో వరుసగా 12.08%, 1.76%, 8.27%, 6.59% 9.11% వృద్ధి రేటు ఉంది. 2019-20లోనే కొంత పెరిగింది.

అనుబంధ రంగాల్లో ఇలా..

రాష్ట్రం వ్యవసాయ ప్రధానం. వ్యవసాయం, ఉద్యానం, పశు సంవర్ధకం, మత్స్య పరిశ్రమలో వృద్ధి రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక సర్వే 2017-18నుంచి19-20 మధ్యపరిస్థితులను పోల్చి చూపింది.
* వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి అంతకుముందు కన్నా 19% వృద్ధి రేటు తగ్గింది. 2019-20 నాటికి దాదాపు 18%కు పైగా నమోదైంది.
* ఉద్యాన రంగంలో 4.61%కు తగ్గి మళ్లీ 11.6% వృద్ధి రేటు నమోదైంది.
* పశుసంవర్ధక శాఖలో 8.5% వృద్ధిరేటు 2018-19లో నమోదు కాగా ఆ తర్వాత ఏడాది 4.5% ఉంది.
* మత్స్య రంగంలో వృద్ధిరేటు మరీ తగ్గింది. 2017-18 నుంచి 18-19 నాటికి 16.3% మేర పెరిగింది. ఆ మరుసటి ఏడాది 5.4% మాత్రమే ఉంది.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే క్వార్టర్స్​లో పేకాట రాయుళ్ల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.