ETV Bharat / city

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్​తో ఎస్ఈసీ భేటీ - sec meet with governor breaking

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు.

AP: sec meeting with governor on local body elections
ఏపీ: స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ
author img

By

Published : Nov 18, 2020, 2:38 PM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్​తో.. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ముగిసింది. గవర్నర్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన ఎస్‌ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను గవర్నర్‌కు వివరించారు.

ఎన్నికల నిర్వహణ కోసం.. ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై చర్చించారు. గవర్నర్​తో భేటీ అనంతరం.. రమేశ్ కుమార్ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు. కాసేపట్లో జిల్లా అధికారులతో ఎస్ ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలపై.. వీడియో కాన్ఫరెన్స్ లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: మీసేవల ముందు పడిగాపులు... క్యూలైన్లలో పడరాని పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.