AP CORONA CASES: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27,522 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,679 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 9,598 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 46,119 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొత్తగా మరో ఇద్దరు మరణించినట్లు పేర్కొంది.
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
India Covid cases:
భారత్‌లో రోజువారి కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 71,365 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 1,217 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 1,72,211మంది వైరస్‌ను జయించారు. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,24,10,976
- మొత్తం మరణాలు: 5,05,279
- యాక్టివ్ కేసులు: 8,92,828
- మొత్తం కోలుకున్నవారు: 4,10,12,869
ఇదీచూడండి: 'కరోనా కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్'- డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్