AP DGP about viveka Murder case : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై ఏపీ నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసు విచారణలో ఏపీ పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. కేసు దర్యాప్తును సీబీఐ చూస్తోందని వెల్లడించారు. గంజాయి సాగు, రవాణా నియంత్రణకు ఒడిశాతో కలిసి పనిచేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెంచామన్నారు. కళాశాలలు, రిసార్టులు, కాటేజ్‌లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. సైబర్‌క్రైమ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు.
"వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోంది. కేసు విచారణలో రాష్ట్ర పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. గంజాయి సాగు, రవాణా నియంత్రణకు ఒడిశాతో కలిసి పనిచేస్తాం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిఘా ఉంది. కళాశాలలు, రిసార్టులు, కాటేజ్‌లపై ప్రత్యేక దృష్టి సారించాం. సైబర్‌క్రైమ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం"
- రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ
ఇదీ చదవండి : CM KCR Delhi Tour : దిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్