ETV Bharat / city

Amaravati lesson removed : పదో తరగతి సిలబస్‌ నుంచి అమరావతి పాఠం తొలగింపు

Amaravati lesson removed : రాజధాని అమరావతి ప్రాముఖ్యతను తెలిపేలా ఏపీలో పదో తరగతి తెలుగు పుస్తకంలో రూపొందించిన పాఠాన్ని అధికారులు సిలబస్ నుంచి తొలగించారు. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకూడదని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు.

Amaravati lesson removed
అమరావతి పాఠం తొలగింపు
author img

By

Published : Apr 4, 2022, 10:52 AM IST

Amaravati lesson removed : ఆంధ్రప్రదేశ్​లో.. శాతవాహన రాజులు వారికంటే ముందు పాలకులు అమరావతిని కేంద్రంగా చేసుకుని ఏ విధంగా పరిపాలన సాగించారు? ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేసింది? ఇలా అనేక అంశాలను వివరిస్తూ పదో తరగతి తెలుగు పుస్తకంలో రెండో పాఠంగా అమరావతిని గత ప్రభుత్వ హయాంలో ముద్రించారు. ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అమరావతి పాఠాన్ని ఈ ఏడాది సిలబస్‌ నుంచి తొలగించారు. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకూడదని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందే నాటికే పాఠశాలల్లో అమరావతి పాఠాన్ని ఉపాధ్యాయులు బోధించారు. సిలబస్‌ భారం తగ్గించాలంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగించే వీలుండగా కావాలనే అమరావతిని తీసివేశారని పలువురు అంటున్నారు. ఈ నెల 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్‌ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి చదువుకుని పరీక్షలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొవిడ్‌ కారణంగా పాఠశాలల పనిదినాలు తగ్గినందువల్ల ఏయే పాఠ్యాంశాలు బోధించాలి?... వేటిని మినహాయించాలనే అంశంపై ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని, ఆ మేరకే ఉపాధ్యాయులు చెప్పారని తుని ఎంఈవో గీతాదేవి తెలిపారు.

ఇదీ చదవండి: ఆ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం... తెలుగు భాషకు ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.