వివిధ ప్రవేశ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు 2020లో ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఇంటర్మీడియట్లో ఇచ్చిన 35 శాతం మార్కులు సరిపోతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 24 నాడు ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. కోవిడ్ దృష్ట్యా ఈసారి ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఓపెన్ స్కూల్ సొసైటీ... ఇంటర్మీడియట్లో 35 శాతం మార్కులు ఇస్తూ పాస్ చేసింది.
ఎంసెట్, నీట్ వంటి రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు పొందాలంటే మార్కుల శాతం ఎక్కువగా ఉండాల్సి ఉంది. దీంతో విద్యార్థులు ప్రభుత్వానికి విన్నవించారు. హైకోర్టులో కూడా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన ప్రకారం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.
ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటే దేవుడికి కట్నం!