తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి మాట్లాడారు(amit shah phone call to chandrababu news). ఈ సందర్భంగా.. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని.. అమిత్‌షాకు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలనూ వివరించినట్టు తెలుస్తోంది. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు పోరాడుతుంటే.. వైకాపా దాడులకు తెగపడటంతోపాటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ నెల 25, 26 తేదీల్లో దిల్లీలో పర్యటించిన చంద్రబాబు, రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తోపాటు అమిత్‌షాను కలిసేందుకు సమయం కోరారు(chandrababu delhi tour news). అయితే.. కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్‌షా 26వ తేదీ మధ్యాహ్నం దిల్లీకి వచ్చారు. ఆ వెంటనే కేంద్ర మంత్రివర్గ సమవేశంలో పాల్గొన్నారు. అపాయింట్మెంట్ కుదరకపోవటంతో చంద్రబాబు 26వ తేదీ సాయంత్రం దిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో.. బుధవారం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్‌షా.. వివరంగా మాట్లాడినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: