చైనా, ఇటలీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇరాన్, జర్మనీ, స్పెయిన్ నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయం నుంచి నేరుగా వికారాబాద్‌లోని హరిత రిసార్ట్స్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు గానూ వివిధ జిల్లా నుంచి అంబులెన్స్‌లు తెప్పించి... కోఠిలోని ప్రజారోగ్య సంచాలకులు కార్యలయంలో సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే కరోనా అనుమానితులను తరలించే టెక్నీషియన్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చింది.
ఇదీ చూడండి: ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది: కేసీఆర్