ETV Bharat / city

Holi in hyderabad: హోలీకి భాగ్యనగరం సిద్ధం.. కుతుబ్‌షాహీల నుంచే పండగ - హోలీ ఫెస్టివల్‌

Holi in hyderabad: హోలీ పండగకు భాగ్యనగరానికి ప్రత్యేక అనుబంధముందని చరిత్రకారులు చెబుతున్నారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే ఎంతో ఘనంగా నిర్వహించేవారని పేర్కొంటున్నారు. ఈ రంగుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. కానీ రసాయన రంగులతో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

holi festival
holi festival
author img

By

Published : Mar 17, 2022, 9:27 AM IST

Holi in hyderabad: రంగుల పండక్కు నగరం సిద్ధమైంది.. వందలాది మంది నడుమ నిర్వహించే రెయిన్‌డ్యాన్సులు, సాంస్కృతిక వేడుకలకు అన్ని వేదికలు సిద్ధమయ్యాయి. రంగుల విక్రయాలతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రసాయన రంగులూ మార్కెట్లోకి వస్తున్నాయి. సింథటిక్‌ రంగుల్లో ఉండే లోహాలు, అమ్లాలు, అల్కలైట్‌, గాజుపోడి, నలుపు రంగులో ఆక్సైడ్‌, ఆకుపచ్చ రంగులో కాపార్‌ సల్ఫైట్‌, ఎరుపు రంగులో మెర్క్యురీ సల్ఫేట్‌, వీటితో పాటు, చాక్‌పౌడర్‌, సిల్కాన్‌ వంటివి కన్ను, చర్మంపై పడితే ప్రమాదం. రసాయన రంగులతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఇవి కళ్లల్లో పడితే కొన్నిసార్లు చూపు పోయే ప్రమాదం ఉందని నేత్ర వైద్య నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పూలు, కూరగాయలు, పసుపు లాంటివి ఎండబెట్టి వాటితో తయారు చేసిన రంగులతో హోలీ నిర్వహించుకోవడం సురక్షితమని, సహజ రంగులతో పండగ చేసుకోవాలని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రాంతాల్లో వేదికలు...

రంగ్‌దే హైదరాబాద్‌ 3.0, హోలీ ఫెస్టివల్‌ విత్‌ శాంతి పీపుల్‌, ది హోలీ ల్యాండ్‌, హోలీ ఫెస్టివల్‌ 2022, ఖేలో హోలీ, హోలీ హై 3.0, విబ్జియార్‌ ది అల్టిమేట్‌ హోలీ ఫీస్టా, హోలీ దహన్‌, ది ఫెస్టివల్‌ ఆఫ్‌ కలర్స్‌, బాలం పిచికారీ సీజన్‌ తదితర పేర్లతో మాదాపూర్‌, సరూర్‌నగర్‌, సికింద్రాబాద్‌, మియాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పీపుల్స్‌ప్లాజా, పంజాగుట్టతో పాటు తదితర అపార్ట్‌మెంట్లలో సమూహ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇవి తప్పనిసరి..

  • కళ్ల చుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. రంగులు పడితే కమిలిపోయి ప్రభావం కంటి చూపుపై పడుతుంది. హోలీ కోసం బయటకు వెళ్లే ముందు కొబ్బరి, బాదం నూనె కళ్లచుట్టూ రాసుకోవాలి.
  • ఒకవేళ కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, పుసులు కట్టడం, దురద, రక్తం కారటం లాంటి లక్షణాలు కన్పిస్తే.. నిరక్ష్యం చేయకుండా తక్షణం నేత్ర వైద్యులను సంప్రదించాలి.
  • వాటర్‌ బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో కళ్లలోకి కొడితే ఎక్కువ గాయాలవుతాయి. కొన్నిసార్లు కళ్లల్లో రక్తస్రావం జరుగుతుంది. రెటీనా దెబ్బతినే ముప్పు ఉంటుంది. కళ్లల్లో చిక్కుకున్న పదార్థాలను చేతి రుమాలు, టిష్యూ పేపర్‌ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తే అది మరింత నష్టాన్ని చేస్తాయి. హోలీలో పాల్గొంటే కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడక పోవడం ఉత్తమం.

కుతుబ్‌షాహీల నుంచే పండగ

హోలీ పండగకు భాగ్యనగరానికి ప్రత్యేక అనుబంధముంది. పరమత సహనం పాటిస్తూ కలిసిమెలసి పండుగలు జరుపుకోవడం అప్పటినుంచే ఉంది. కుతుబ్‌షాహీల నుంచి మొదలు అసఫ్‌జాహీల వరకు అందరూ ఇతర సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చేవారని అందుకు తగిన ఆధారాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. రంగుల పండగను అధికారికంగా గోల్కొండ కోట వేదికగా జరిపేవారట. కుతుబ్‌షాహీ పాలకులు అత్యంత ఘనంగా హోలీ నిర్వహించేవారు. గోల్కొండ మినీయేచర్‌ చిత్రం ఒకటి అందుకు ఆధారంగా నిలుస్తోంది. నాలుగో ఇబ్రహీం కుతుబ్‌షా, మహ్మద్‌ కులీ కుతుబ్‌షా-5, మహ్మద్‌ కుతుబ్‌షా-6, అబ్దుల్లా కుతుబ్‌షా-7, చివరి కుతుబ్‌షా పాలకులు ఈ పండగను వైభవంగా నిర్వహించారు. నాటి పాలకులు, ఉన్నత వర్గాల ప్రముఖులతో కలిసి పండగ జరుపుకొన్న 17వ శతాబ్దానికి చెందిన గోల్కొండ మినీయేచర్‌ చిత్రంలో ఇది కనిపిస్తుంది. చివరి నిజాం పాలకుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హోలీకి రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ గెజిట్‌ జారీ చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.

ఇదీచూడండి: రోజుకు ఎన్ని జీబీల డేటా వాడేస్తున్నారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.