ETV Bharat / city

అర్హత సాధించినా.. సగం మందే పరీక్ష  రాస్తున్నారు!

author img

By

Published : Sep 24, 2020, 2:03 PM IST

జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షకు అర్హత సాధించినప్పటికీ.. సుమారు మూడొంతుల మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది అర్హత పొందగా.. లక్ష 60వేల మంది మాత్రమే పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ సీటు చాలని భావించి కొందరు.. ర్యాంకు రాకపోవచ్చన్న ఆలోచనతో మరికొందరు వెనక్కి తగ్గి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

all qualified students are attending jee mains exam
అర్హత సాధించినా.. సగం మందే పరీక్ష  రాస్తున్నారు!

జేఈఈ అడ్వాన్స్డ్​ పరీక్షకు దరఖాస్తులు తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా సుమారు పదిలక్షల మంది జేఈఈ మెయిన్ రాయగా.. వారిలో రెండున్నర లక్షల మంది జేఈఈ అడ్వాన్స్​డ్​కు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీ కాలేజీల్లో సీట్లను ఐఐటీ అడ్వాన్స్​డ్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు. అయితే రెండున్నర లక్షల మంది అర్హత సాధించినప్పటికీ.. ఈనెల 27న జరగనున్న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు కేవలం లక్షా 60 వేల 684 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత నాలుగేళ్లలో అతి తక్కువ దరఖాస్తులు ఈ ఏడాదే వచ్చాయి. సుమారు 36 శాతం మంది విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ.. పరీక్షకు దూరంగా ఉన్నారు.

మూడేళ్లుగా..

ప్రతి ఏడాది ఇలాగే దరఖాస్తులు తగ్గిపోతున్నాయి. గతేడాది 2 లక్షల 45మంది అర్హత సాధించగా.. లక్ష 74 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 2018లో 2 లక్షల 31వేల మందిలో లక్ష 64 వేల మంది, 2017లో 2 లక్షల 22వేల మందికి అర్హత ఉండగా..లక్ష 71వేల మంది.. దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 13 వేల 600 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రెండున్నర లక్షల మందిలో పోటీ పడి ఐఐటీలో సీటు సాధించడం కష్టమని కొందరు విద్యార్థులు భావించి.. పరీక్షకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలలో జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. కాబట్టి జేఈఈ అడ్వాన్స్ డ్ రాయకుండా.. చాలామంది విద్యార్థులు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో చేరిపోతుండటం కూడా మరో కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ, ఏపీ నుంచి సుమారు 35వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా.

ఇదీ చూడండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.