ETV Bharat / city

జలాశయాలకు జలకళ..  పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ - nagarjun sagar updates

ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాలకు పాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో వస్తున్న నీటికంటే ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 215 టీఎంసీలకు గాను 212 టీఎంసీలు, నాగార్జున సాగర్​లో 312 టీఎంసీలకు గాను 309 టీఎంసీలుగా ఉంది.

all projects full on krishna river with heavy flood water
జలకల శోభితం.. కృష్ణా నది ప్రాజెక్టులు
author img

By

Published : Oct 15, 2020, 6:25 AM IST

కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ వరద భారీగా వస్తోంది. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండాయి. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. వస్తున్న దానికంటె ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.93 టీఎంసీల నీరు ఉంది.

శ్రీశైలం, నాగార్జున సాగర్ ఫుల్​:

శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీలకు గాను 212 టీఎంసీలు ఉండగా... ఎగువ నుంచి 3 లక్షల 50వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు దాదాపుగా అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్​లో 312 టీఎంసీలకు గాను 309 టీఎంసీల నీరు ఉండగా... 4 లక్షల 30 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.

దిగువకే ఎక్కువ:

సింగూరు, శ్రీరాంసాగర్, మధ్యమానేరు, దిగువ మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ఇప్పటికే నిండాయి. నిజాంసాగర్​కూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నిజాంసాగర్ పూర్తి సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 11.10టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి 41వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువ మానేరుకు దాదాపుగా లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా... అంతకంటే ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి 82 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తుండగా... ఆ మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.

ఇదీ చూడండి: హరీశ్​ రావు ఇప్పటికైనా రెండు కళ్ల సిద్ధాంతం వీడాలి: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.