తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఏపీలోని నెల్లూరు కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించని ధర్నాలో పాల్గొన్న ఆయన.. ఎండ వేడికి కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే సోమిరెడ్డిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
అఖిలపక్ష రాజకీయ పార్టీలు భారీ ప్రదర్శన
నెల్లూరులో అఖిలపక్ష రాజకీయ పార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో తెదేపా, కాంగ్రెస్, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. నెల్లూరు నర్తకి సెంటర్ నుంచి కలెక్టరేట్‌కు అఖిలపక్ష పార్టీల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం నేతలు, కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోమని సోమిరెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆస్తులను తాకట్టు పెట్టే చర్యలను అడ్డుకుంటామని వామపక్ష నేతలు అన్నారు. పథకం ప్రకారం నష్టాలు చూపిస్తూ ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. ఆస్తులను కాపాడుకోవాల్సిన ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: