ETV Bharat / city

‘గ్రేటర్‌’ ఎన్నికలకు అన్ని పార్టీల కసరత్తు షురూ..

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గ్రేటర్‌లో 23 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి.

all main parties started plan of action in ghmc elections 2020
‘గ్రేటర్‌’ ఎన్నికలకు అన్ని పార్టీల కసరత్తు షురూ
author img

By

Published : Nov 17, 2020, 6:53 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలతో ముందుకు సాగుతున్నాయి. అత్యధికశాతం మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించి.. ఆ మేరకు ప్రణాళిక రచించే పనిలో తెరాస ఉండగా.. దుబ్బాక గెలుపు ఊపులో ఉన్న భాజపా ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ముందుకెళ్తోంది. ఇతర పార్టీల నుంచి ముఖ్యనేతల చేరికలపై దృష్టి సారించింది.

బిహార్‌ ఎన్నికల్లో భాజపా విజయంలో కీలక పాత్ర వహించిన భూపేంద్రయాదవ్‌ను రంగంలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్‌లో నేతలు ‘చే’జారకుండా చూస్తూనే మేనిఫెస్టోతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఐఎం కూడా గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలని కసరత్తు చేస్తోంది. భాజపా, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించగా.. తెరాస సర్వేల ద్వారా ఎంపిక చేసే పనిలోఉంది.

ఎక్కువ మంది సిట్టింగులకే టికెట్లు

అభ్యర్థుల ఎంపిక విషయంలో గత శాసనసభ ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్నే హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లోనూ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న కార్పొరేటర్లలో అత్యధిక శాతం మందికి మరోసారి టికెట్లు ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. తీవ్రమైన అభియోగాలుండి పార్టీకి నష్టదాయకం, తప్పనిసరి అనుకున్న వారిని మాత్రమే మినహాయించాలని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో తెరాస తరఫున 99 మంది కార్పొరేటర్లు గెలవగా.. ఆ తర్వాత మరో ముగ్గురు ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెరాస సర్వేలు జరిపించింది. ముందుగా నిర్వహించిన వాటిల్లో కొంతమంది కార్పొరేటర్లపై వ్యతిరేకత వ్యక్తమైంది. సీఎం సూచనతో వారిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అప్రమత్తం చేశారు. దీనికి అనుగుణంగా రెండు నెలల క్రితం వారితో సమావేశం నిర్వహించారు. ప్రజల మధ్య ఉండి వారికి చేరువ కావాలని సూచించారు. దీంతో వారి పనితీరులో కొంత మార్పు వచ్చిందని తాజా సర్వేలో రుజువైంది. దీంతో పాటు రిజర్వేషన్లూ యథాతథంగా ఉన్నందున ప్రస్తుత కార్పొరేటర్లకే మళ్లీ అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్దేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. సీఎం స్పష్టతనివ్వడంతో అధిష్ఠానం వ్యూహాన్ని వారు కూడా అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సీఎం ఆదేశాలు, సర్వే ఫలితాలను విశ్లేషించుకొని పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జులు అభ్యర్థులపై క్షేత్రస్థాయి పరిశీలనలు, స్థానిక నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కార్పొరేటర్లు మినహా టికెట్‌ కోసం ఆరాటపడుతున్న ఇతర అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక కార్యాచరణ సోమవారం వరకు ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, విస్తృతంగా ప్రచారం చేయాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది.

మజ్లిస్‌ పక్కా వ్యూహం

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి లో రెండో అతిపెద్ద పార్టీ అయిన మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) రాబోయే ఎన్నికలకు పక్కా వ్యూహంతో సన్నద్ధమవుతోంది. గత ఎన్నికల్లో 60 స్థానాలకు పోటీ చేసి 44 దక్కించుకున్న ఆ పార్టీ మరోసారి సత్తా చాటుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. సోమవారం నుంచి స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు ఇది కొనసాగుతుంది. తొలిరోజే దారుస్సలాంలో భారీగా కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

తెరాసకు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్‌ ఈసారి అదే పంథాతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ సమావేశమై ఎన్నికల వ్యూహం గురించి చర్చించారు. పరస్పర అవగాహనతో పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో మళ్లీ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే చోట బలాబలాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎంపికలో సిట్టింగులకు ప్రాధాన్యమిచ్చే మజ్లిస్‌ కార్పొరేటర్ల ఎంపికలో మాత్రం సమర్థతను పరిగణనలోనికి తీసుకుని మార్పులు, చేర్పులు చేస్తోంది.

మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ తుదిరూపు

జీహెచ్‌ఎంసీ పరిధిలోని కీలకనేతలు, ప్రజాప్రతినిధులదే ప్రధాన బాధ్యతగా పోరుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. మరోవైపు పార్టీకి దుబ్బాక ఎన్నిక సెగ తగులుతోంది. ఈ ఎన్నికల అనంతరం గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు కొందరు భాజపా వైపు చూస్తుండటంతో పార్టీ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఎల్‌బీనగర్‌ స్థానానికి అభ్యర్థి అని భావించిన కె.నరసింహారెడ్డి భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే పోటీకి ఆసక్తిచూపిన సుమారు 300 మంది నుంచి దరఖాస్తులొచ్చాయి.

ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మాణికంఠాగూర్‌ నగర నేతలతో సమావేశమై పరిస్థితిని చర్చిస్తున్నారు. మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డి అధ్యక్షుడిగా, ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కన్వీనర్‌గా ఏర్పాటైన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ కసరత్తు తుదిదశకు చేరుకుంది. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లలో కీలక నేతలు బాధ్యత తీసుకోవాలని పార్టీ సూచించింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలో 48 డివిజన్లు, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 40, చేవెళ్ల లోక్‌సభ స్థానంలో 24 డివిజన్లు ఉన్నాయి. మల్కాజ్‌గిరి పరిధిలో రేవంత్‌రెడ్డి, సికింద్రాబాద్‌ పరిధిలో అంజన్‌కుమార్‌యాదవ్‌, చేవెళ్ల పరిధిలో కొండా విశ్వేశ్వరరెడ్డి దృష్టి సారించారు.

ఏక్షణంలోనైనా నోటిఫికేషన్‌ వచ్చే పరిస్థితులుండగా.. పీసీసీ మాత్రం పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించకపోవడంపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు.డివిజన్లలో బలమైన కాంగ్రెస్‌ నేతలతో భాజపా చర్చిస్తుండటంపై అప్రమత్తం కాకుంటే మరింత నష్టం తప్పదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు.

నోటిఫికేషన్‌ రోజే తొలి జాబితా

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కసరత్తును కమలదళం వేగవంతం చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. తొలి విడత 40 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను..ఇతర సీనియర్‌ నేతలకు డివిజన్ల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.

తొలిసారి గ్రేటర్‌పై జాతీయపార్టీ దృష్టి

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీలు గెలవడం, దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో తొలిసారి గ్రేటర్‌ ఎన్నికల్ని భాజపా అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఎన్నికల కోసం భాజపా నాయకత్వం నియమించిన ఐదుగురు ఇన్‌ఛార్జుల్లో ఒకరు, మొత్తం ఎన్నికల బాధ్యతల్ని పర్యవేక్షించే కీలకనేత భూపేంద్రయాదవ్‌ మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం కల్లా హైదరాబాద్‌కు రానున్నారు. బిహార్‌ ఎన్నికల్లో భాజపాను విజయపథంలో నడిపించడంలో ఆయనది కీలక పాత్ర. గ్రేటర్‌పీఠంపై కాషాయజెండా ఎగరేయాలన్న లక్ష్యంతో భాజపా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించి బలమైన నేతల్ని గుర్తించింది.

ముఖ్యనేతలు విస్తృతంగా సమావేశమవుతున్నారు. ఆశావహుల నుంచి పార్టీ సోమవారం దరఖాస్తులు స్వీకరించింది. పార్టీ నుంచి గెలిచిన, ఇతర పార్టీల నుంచి వచ్చిన సిట్టింగ్‌ కార్పొరేటర్లకు టికెట్‌ ఇవ్వాలని భాజపా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెరాస, కాంగ్రెస్‌లో అసంతృప్తులు, టికెట్‌ దక్కే అవకాశం లేని బలమైన నేతల్ని చేర్చుకునే ప్రయత్నాలను కమలదళం ముమ్మరం చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.