ETV Bharat / city

సాంకేతికతతో సవాళ్లను అధిగమించాం: అకున్ సబర్వాల్ - akun sabharwal gujarat civil supply meet

తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్​లో జరుగుతున్న జాతీయ సదస్సులో మన విధానాలకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి.

సాంకేతితతో సవాళ్లను అధిగమించాం: అకున్ సబర్వాల్
author img

By

Published : Oct 14, 2019, 11:49 PM IST

Updated : Oct 15, 2019, 1:37 AM IST

సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అద్భుత ప్రగతి సాధించిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. "ప్రజా పంపిణీలో సంస్కరణలు - వినూత్న చర్యలు" అంశంపై రెండు రోజులపాటు గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సుకు కమిషనర్ హాజరయ్యారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార కార్యదర్శులు పాల్గొన్నారు. మొదటి రోజు ఈ సదస్సులో కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌... పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సాధించిన విజయాలను వివరించారు.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3.51 కోట్ల మంది జనాభా ఉందని, ఇందులో 87.72 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయని చెప్పారు. తద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారని... దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కిలో రూపాయి చొప్పున 6 కిలోల బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రేషన్‌ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేందుకు వీలుగా 2018 మే లో రేషన్‌ పోర్టబిలిటీ ప్రారంభించడం వల్ల ప్రతి నెల దాదాపు 13 లక్షల మంది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారని ప్రకటించారు.

అన్నింటికి యాప్స్​..

ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థ పకడ్బందీగా చేపట్టడం కోసం మొబైల్‌ యాప్‌ ప్రవేశపెట్టామన్నారు. ఓపీఎంఎస్‌, కొనుగోలు కేంద్రాల జియో ట్యాగింగ్‌, రైస్‌ మిల్లర్ల లావాదేవీలకు సంబంధించి అక్నాలెడ్జ్‌మెంట్‌ యాప్‌, టీ రేషన్‌, టీ వాలెట్‌ యాప్‌ వంటి సదుపాయాలు ఈ మొబైల్‌ యాప్స్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాల శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడిందని ఇతర రాష్ట్రాలకు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులు చేపట్టడం ద్వారా ప్రజానీకానికి నాణ్యమైన, మెరుగైన సేవలందిస్తోందని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆహార, పౌరసరఫరాల కార్యదర్శులు ప్రశంసించడం విశేషం.

ఇవీచూడండి: 'భారత క్రికెట్​ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది'

Last Updated : Oct 15, 2019, 1:37 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.