ETV Bharat / city

'గ్రామీణ ప్రాంతాల్లోనూ 30శాతం మంది ఫ్యాటీ లివర్​ బాధితులు' - ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నాగేెశ్వరరెడ్డి

Nash Day in AIG Hospital: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ సుమారు 30 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. 'నాష్​ డే' ని పురస్కరించుకుని ఏఐజీ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Nash Day in AIG Hospital
Nash Day in AIG Hospital
author img

By

Published : Jun 9, 2022, 7:16 PM IST

Nash Day in AIG Hospital: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారు కేవలం 10 శాతం మంది బరువు తగ్గటం ద్వారా ఈ సమస్యని నియంత్రించుకోవచ్చని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్​రెడ్డి అన్నారు. నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటీస్​(నాష్​) డే ని పురస్కరించుకుని ఏఐజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైద్యులతో కలిసి ఆయన కాలేయ సమస్యలపై మాట్లాడారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోనూ సుమారు 30 శాతం మందికి ఫ్యాటీ లివర్​ సమస్య ఉందని డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు.

ఏఐజీ ఆసుపత్రి నేతృత్వంలో సుమారు లక్షమంది రిపోర్టులను పరిశీలించి ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తించినట్టు వివరించారు. దేశంలో మరో వెయ్యి మంది జెనెటిక్ పరీక్షలు చేసిన తర్వాత... జీన్స్​లో వస్తున్న మార్పుల కారణంగా ఈ సమస్య బారినపడుతున్న వారు అధికంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోయినా... జెనెటికల్ గానూ, బరువు కారణంగాను ఫ్యాటీ లివర్ బాధితులు పెరుగుతున్నారన్నారు. ఫ్యాటీ లివర్ సమస్యలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా... ఈ సమస్య ఉన్న వారిలో క్రమంగా గుండెపోటు రావడం, కాలేయం పూర్తిగా పనిచేయకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నార. తద్వారా ఆ సమస్య మరణానికి దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:ఆ నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముంది: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.