ఎన్నికల నియమావళి పేరుతో వరద సాయాన్ని ఆపకుండా కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి ఓట్లు దండుకోడానికి ఇలా చేశారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ముందే... నియమావళిని పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. చివరి వరద బాధితుడి వరకు సాయం అందే వరకు దరఖాస్తుల స్వీకరణ, పంపిణీ కార్యక్రమం కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్