ETV Bharat / city

'రాష్ట్ర ఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉంది'

కరోనా పరీక్షలు కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేని స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు.

Sampath Kumar, Congress leader Sampath Kumar
సంపత్ కుమార్, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్
author img

By

Published : May 24, 2021, 5:11 PM IST

కొవిడ్ పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డిలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉందని, దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని విమర్శించారు. కరోనా వ్యాక్సినేషన్ ఆపేసి పదిరోజులవుతున్నా.. పునరుద్ధరణ చేయడం లేదని, టీకాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తప్పులు నెట్టుకుంటున్నారని ద్వజమెత్తారు.

జిల్లా ఆస్పత్రుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.